T40

హిందూదేవాలయాల్లో ప్రతి ఆలయంలో దేవుడి విగ్రహం అనేది ఉంటుంది. భక్తులు గుడికి వెళ్ళినప్పుడు దేవుడు విగ్రహాన్ని నమస్కరించి పూజలు చేస్తారు. మరి విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన ఎందుకు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది. జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు. ఇక విషయంలోకి వెళితే, విగ్రహం అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. భగవంతుని స్వరూపాన్ని, శక్తుల్ని, గుణాల్ని విగ్రహం విశేషంగా గ్రహిస్తుంది. మంత్రశక్తి వలన ఆ మంత్రాధిదేవత తత్వమును విశేషంగా ఆకర్షిస్తుంది. తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ మంత్ర ప్రభావించే ప్రకాశిస్తుంది గనుక విగ్రహాన్నే అర్చ అంటారు. పంచలోహాలతో మట్టితో, కర్రతో, రాతితో చేయబడిన విగ్రహాలలో మంత్రశక్తి చేత, మనభావనాబలం చేత భగవంతుడు వేంచేసి ఉంటాడు. అయితే ఎవరు ఎవరు ఏ ఏ వస్తువు తో అయినా, ఏ ఏ ఆకారాన్ని కల్పించి భక్తితో పూజించదలిస్తే, నేను ఆ వస్తువునే, ఆ ఆకారాన్నే నాదిగా భావించి ప్రీతితో ఆ అర్చా విగ్రహం ద్వారానే వారి ఆరాధనలని గ్రహించి వారిని కోరికలను తీర్చుదును అని గీతలో పరమాత్మ చెప్పాడు. విగ్రహం అనేది ఒక శక్తివంతమైన అడ్డం వంటిది. ఇది మన భావనాలనే అనేక రేట్లు అధికంగా చేసి మనకి ఇస్తుంది. ఇది రాయే అనుకుంటే మన మనసు మొద్దుబారి, రాతి భావననే కలిగిస్తుంది. సుఖం, ఆనందం, మోక్షం ఆ అర్చామూర్తి ఇవ్వగలదని భావించి ఆరాదిస్తే వాటినే మనకు అందిస్తుంది. ఇది ఇలా ఉంటె, ఏకలవ్యుడు ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు. ఇంకా ధ్రువుడు నారదుని ఉపదేశంతో శ్రీమన్నారాయణుని మూర్తిని నిర్మించి, దానిపై మనసు నిలిపి ఆరుమాసాల్లో భవత్సాక్షాత్కారం పొందాడు.

PRESSLINK:

https://youtu.be/tQSAdxL_c_Q

https://youtu.be/4bufn8l_KeU

2 Corinthians 13: 14
The grace of the Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Ghost, be with you all. Amen.Amen!!

E40

PRESSLINK:

https://youtu.be/tQSAdxL_c_Q

https://youtu.be/4bufn8l_KeU

Isaiah 56: 6
Also the sons of the stranger, that join themselves to the LORD, to serve him, and to love the name of the LORD, to be his servants, every one that keepeth the sabbath from polluting it, and taketh hold of my covenant; Amen!!